Monday, December 23, 2024

అదానీ చేతికి మరో మీడియా సంస్థ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎన్‌డిటివి తర్వాత అదానీ గ్రూప్ మరో మీడియా సంస్థలో వాటాలను చేజిక్కించుకుంది. డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్ క్వింటిలియన్ బిజినెస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 49 శాతం వాటాను అదానీ కంపెనీకి చెందిన ఎఎమ్‌జి మీడియా నెట్‌వర్క్ కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ రూ.47.84 కోట్లు, ఈ మేరకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. క్వింట్‌ను రాఘవ్ బెహ్ల్, రీతూ కపూర్ స్థాపించారు. క్వింటిలియన్ బిజినెస్ మీడియాను వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్ క్వింట్‌ను నడుపుతోంది.

ఇప్పుడు దీనిని బిక్యూ ప్రైమ్ అని పిలుస్తారు. ప్రచురణ, ప్రకటనలు, ప్రసారం, కంటెంట్ పంపిణీ కోసం అదానీ గ్రూప్ 2022 ఏప్రిల్ 26న ఎఎంజి మీడియా నెట్‌వర్క్ లిమిటెడ్ పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఎన్‌డిటివి(న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్)లో అదానీ గ్రూప్ 64.71 శాతం వాటాను కలిగి ఉంది. క్వింటిలియన్ బిజినెస్ మీడియా 4 నెలల క్రితం బిక్యూ ప్రైమ్ హిందీని ప్రారంభించింది. దీని ద్వారా ప్రపంచ స్థాయి వ్యాపార, ఆర్థిక విషయాలను హిందీలో అందించాలని కంపెనీ భావిస్తోంది. బిక్యూ ప్రైమ్ భారతీయ ఆర్థిక వ్యవస్థ, వ్యాపారం, ఆర్థిక మార్కెట్‌ల విశ్లేషణాత్మక కథనాలను అందిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News