Thursday, January 23, 2025

అదానీ గ్రూపు వెనుకడుగు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అదానీ గ్రూపు కంపెనీలు హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడ్డాక ఇప్పుడు బాగా తగ్గాయి. మోసం వెలుగు చూశాక జనవరి నుంచి అదానీ కంపెనీలు 125 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయాయి. కొత్తకొత్త రంగాలకు విస్తరించాలనుకున్న అదానీ ఇప్పుడు వెనుకడుగు వేశారు. అదానీ గ్రూపుకు ఇప్పుడు నిధుల కటకట ఎక్కువయిందని తెలుస్తోంది. అప్పులు తలకు మించిన భారమయ్యాయి. 4 బిలియన్ డాలర్ల ముంద్రాలోని కోల్ టు పాలీవినైల్ క్లొరైడ్ ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు వెనుకడుగు వేశారు. అల్యూమినియం, స్టీల్, రోడ్డు ప్రాజెక్టులు వంటి వాటి విషయంలో కూడా వెనుకంజ వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీకి ఎంతో కావాలసిన పారిశ్రామికవేత్త అదానీ ఇప్పుడు ఎన్నో ప్రాజెక్టుల నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

హిండెన్‌బర్గ్ నివేదికను అదానీ తిరస్కరించినప్పటికీ వాస్తవంలో ఆయన ఆస్తి కరిగిపోతున్నదన్నది వాస్తవం. పెట్టుబడిదారులకు కూడా ఆయన కంపెనీల్లో నమ్మకం సన్నగిల్లింది. రిటైల్ ఇన్వెస్టర్లు కాక ఎవరు మదుపర్లుగా ఉన్నారన్నది వెలుగుచూడ్డంలేదు. కొత్తగా అనేక సంస్థలను కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచించుకున్న అదానీ గ్రూపు ఇప్పుడు వెనుకంజవేస్తోన్నది నిజం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News