Friday, November 15, 2024

భారీగా పతనమవుతున్న అదానీ షేర్లు!

- Advertisement -
- Advertisement -

ముంబై: అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ అదానీ గ్రూప్ స్టాక్‌మార్కెట్ అవకతవకలకు పాల్పడింది, వారి షేర్ల విలువను కృత్రిమంగా 80 శాతం రెట్టింపు చేసి చూపారని పేర్కొన్న తర్వాత అదానీ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఆ తర్వాత ఆ సంస్థ అమెరికా ట్రేడెడ్ బాండ్లు, నాన్‌ఇండియన్‌ట్రేడెడ్ డిరైవేటివ్స్‌లను షార్ట్ చేసింది. పైగా తన నివేదిక కేవలం భారత వెలుపల ట్రేడవుతున్న సెక్యూరిటీల విలువకు సంబంధించింది మాత్రమేనని పేర్కొంది. దీనికి ముందు హిండెన్‌బర్గ్ ఆరోపణలన్నీ అవాస్తవమని అదానీ గ్రూప్ పేర్కొంది. అయినప్పటికీ అదానీ కంపెనీల షేర్ల విలువ ఇప్పటికీ పతనమవుతూ ఉన్నాయి. ఇప్పటికే 110 బిలియన్ డాలర్ల(రూ. 9.07 లక్షల కోట్లు) సంపద అదానీ 10 కంపెనీలలో హరించుకుపోయాయి. అదానీ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ కూడా అందులో ఉంది.

ఇదివరకటి చరిత్రను కనుక చూస్తే… గతంలో అంటే 2000-2001 హూస్టన్‌కు చెందిన ఎన్‌రాన్ కంపెనీ 65 బిలియన్ డాలర్ల(రూ. 5.36 లక్షల కోట్లు) మార్కెట్ వ్యాల్యూను కోల్పోయింది. నాడు అమెరికాలో అదే అతి పెద్ద దివాలా. తరువాత 2016-18లో వైర్‌కార్డ్ దివాలాతీసింది. ఆ కంపెనీ మనీలాండరింగ్, అమెరికా ఇంటర్నెట్ గ్యాంబ్లింగ్ నిబంధనల ఉల్లంఘన వంటి వాటికి పాల్పడిందని ఆరోపణ. దాంతో 2018లో ఆ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 24 బిలియన్ యూరోల మేరకు సంపద హరించుకుపోయింది. ఆ తర్వాత హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ సెమీ ట్రక్ కంపెనీ నికోలా కార్పొరేషన్ బాగోతంను బట్టబయలుచేశారు. ఒకప్పుడు ఆ కంపెనీ మార్కెట్ వాల్యూ దాదాపు 30 బిలియన్ డాలర్లు(రూ.2.47 లక్షల కోట్లు) ఉండింది. ప్రస్తుతం ఆ కంపెనీ మార్కెట్ విలువ 1.3 డాలర్లు(రూ. 10724 కోట్లు). 2020లో ఆ కంపెనీ మార్కెట్ విలువ అత్యధిక విలువ నుంచి 95 శాతం పడిపోయింది.

హిండెన్‌బర్గ్ 2020 నుంచి ఇప్పటి వరకు 30 కంపెనీలను లక్షం చేసుకుంది. ఆ రీసెర్చ్ కంపెనీ నివేదిక వెలువడిన మరునాడే ఆయా కంపెనీల మార్కెట్ విలువ 15 శాతం పడిపోయాయని బ్లూమ్‌బర్గ్ న్యూస్ పేర్కొంది. ఆ తర్వాత ఆరు నెలల్లో వాటి షేర్ల విలువ 26 శాతం పతనమయ్యాయి. ఇదేరీతిలో వాలియంట్ ఫార్మాసూటికల్స్ పతనమయింది. ఆ కంపెనీ ఇప్పుడు బౌష్ కంపెనీస్ కార్పొరేషన్ పేరిట ట్రేడవుతోంది. 2011లో చైనా అటవీ కంపెనీ సైనోఫారెస్ట్ కార్పొరేషన్ కేవలం కొన్ని రోజుల్లోనే 70 శాతం మార్కెట్ విలువను కోల్పోయింది. లాస్‌ఏంజెల్స్‌కు చెందిన హెర్బాలైఫ్ న్యూట్రిషన్ లిమిటెడ్ కూడా వివాదాల్లో నష్టపోయింది.

Enron collapse

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News