Monday, January 20, 2025

నాలుగో స్థానానికి పడిపోయిన అదానీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచ బిలినీయర్ల జాబితాలో రెండో స్థానానికి చేరిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తాజాగా నాలుగో ర్యాంక్‌కు పడిపోయారు. అంటే ఆయన రెండు స్థానాలు దిగువకు చేరారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, అమెజాన్ జెఫ్ బెజోస్ గౌతమ్ అదానీని అధిగమించి మళ్లీ మూడో స్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ నాలుగో స్థానానికి చేరారు. జాబితా ప్రకారం, గౌతమ్ అదానీ ఆస్తులు ఇప్పుడు 120 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఆయన సంపద 872 మిలియన్ డాలర్లు తగ్గింది. 2023 జనవరి 1 నుండి ఇప్పటి వరకు ఆయన సంపద 683 మిలియన్ డాలర్లు తగ్గింది. మరోవైపు జెఫ్ బెజోస్ ఆస్తులు 121 బిలియన్ డాలర్లకు పెరిగాయి.

2023లో ఇప్పటివరకు బెజోస్ నికర విలువ 13.8 బిలియన్ డాలర్లు పెరిగిందని జాబితా వెల్లడించింది. ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ 188 బిలియన్ డాలర్ల సంపదతో బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 2023లో ఆయన తన నికర విలువకు 26 బిలియన్ డాలర్లను జోడించారు. టెస్లాకు చెందిన ఎలోన్ మస్క్ బిలియనీర్ల జాబితాలో రెండో స్థానంలో ఉండగా, ఆయన నికర విలువ 145 బిలియన్ డాలర్లుగా ఉంది. 2023లో మస్క్ తన నికర విలువ 8.21 బిలియన్లు పెరిగింది. 2022లో మస్క్ నికర విలువ భారీగా క్షీణించింది.

ముకేశ్ అంబానీ నికర విలువ తగ్గింది

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ బిలియనీర్ల జాబితాలో 12వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద ఇప్పుడు 84.7 బిలియన్ డాలర్లకు తగ్గింది. అంటే టాప్ 10 జాబితో నుంచి బయటకి వచ్చారు. ఇటీవల కాలంలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు క్షీణిస్తూ ఉన్నాయి. దీంతో గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీ నికర విలువ తగ్గింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News