Monday, December 23, 2024

అదానీ షేర్ల బౌన్స్‌బ్యాక్!

- Advertisement -
- Advertisement -

ముంబై: గౌతమ్ అదానీ షేర్లు హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత గణనీయంగా పడిపోయాయి. కానీ నేడు ఆయన షేర్లు గణనీయంగా తిరిగి కోలుకున్నాయి(బౌన్స్‌బ్యాక్). ప్రపంచ టాప్ 20 బిలియనీర్ల జాబితా నుంచి తొలగిన ఆయన తిరిగి 17వ స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం అదానీ షేర్లు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరయితే 17 శాతం మేరకు పెరిగింది. అదానీ గ్రూప్ కంపెనీలన్నీ నేడు తిరిగి లాభాల్లో ట్రేడవుతున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ మాత్రమే కాకుండా అదానీ గ్రీన్, అదానీ పోర్ట్, అదానీ ట్రాన్స్‌మిషన్, ఎన్‌డిటివి స్టాక్స్ వంటివన్నీ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.

Adani shares in green

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News