Thursday, January 23, 2025

సగానికి పైగా కరిగిపోయిన అదానీ సంపద

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: అదానీ గ్రూపు వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ ఆస్తుల క్షీణత ఆగడం లేదు. మంగళవారం కూడా అదానీ గ్రూపు కంపెనీల షేర్ల ధరలు భారీగా పతనమయ్యాయి. హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైన దరిమిలా గత 22 రోజుల్లో అదానీ గ్రూపు 66 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. మంగళవారం ఒక్కరోజే 3.40 బిలియన్ డాలర్ల నష్టాన్ని అదానీ గ్రూపు స్టాకులు నష్టపోయాయి.

అదానీ గ్రూపు షేర్ల ధరలు మంగళవారం ప్రారంభం నుంచి నష్టాల బాట పట్టాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ ట్కాన్స్‌మిషన్, ఎన్‌డిటివి, అదానీ టోటల్ గ్యాస్‌తోసహా అదానీ గ్రూపు కంపెనీలలో చాలావరకు అన్ని కంపెనీల షేర్ల ధరలు లోయర్ సర్కూట్స్‌లో లాక్ అయ్యాయి. వీటితోపాటు అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎసిసి, అంబుజా సిమెంట్ షేర్ల ధరలు కూడా రెడ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ పోర్టు షేర్లు మాత్రమే గెయిన్‌లో ట్రేడ్ అవుతున్నాయి.

ఇలా ఉండగా..అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైన జనవరి 24వ తేదీ నాడు 119 బిలియన్ డాలర్ల విలువైన నికర ఆస్తులు కలిగి ఉన్న అగౌతమ్ అదానీ ప్రపంచ కుబేరులలో మూడవ స్థానంలో ఉన్నారు. కాగా..మంగళవారం నాటికి ఆయన ఆస్తుల నికర విలువ 52.4 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో 24వ స్థానానికి దిగజారారు. అంతేగాక..భారతదేశంలోని అత్యంత సంపన్నుల ఆబితాలో ప్రథమ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ప్రస్తుతం ఆ స్థానాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేష్ అంబానీకి వదులుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News