Sunday, January 19, 2025

అగ్నివీర్‌లనూ వదలని అదానీ

- Advertisement -
- Advertisement -

హిమాచల్ ప్రదేశ్‌లోని బర్మానా సిమెంట్ ఫ్యాక్టరీలో శిక్షణ కేంద్రం
ఇలాగైతే జాతీయ భద్రత మాటేమిటని పలువురి ఆందోళన

హామీర్పూర్/న్యూఢిల్లీ : ఇక్కడా.. అక్కడా కాదు.. ఎక్కడైనా మేమే అంటున్నట్లుంది అదానీ గ్రూప్ వ్యాపార వ్యవహారాలు చూస్తుం టే. తాజాగా అదానీ సంస్థ తన ఆధీనంలో నడిచే సిమెంట్ ఫ్యాక్టరీలో అగ్నివీర్‌లకు శిక్షణా కేంద్రాన్ని తెరిచింది. త్రివిధ దళాల్లో ని యామకాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎం తో ప్రతిష్టాత్మకంగా అగ్నివీర్‌ల వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తె లిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్ పూర్ జిల్లా, బర్మానాలో ఉ న్న ఏసీసీ సెంటర్‌లోని సిమెంట్ పరిశ్రమలో శిక్షణ కేంద్రం తెరవ డం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ శిక్షణ కేంద్రాన్ని బ్రిగేడియర్(రిటైర్డ్) మదన్‌షీల్ శర్మ ఇటీవల ప్రారంభించారు.

Also Read: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి

ఈయన హి మాచల్ ప్రదేశ్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ ఈ ప్రాంత యువతకు అదానీ సిమెంట్ గ్రూప్ చొరవ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. అగ్నివీర్ ఎంపిక విధానంలో అవగాహన కూడా కల్పిస్తుందని, రక్షణ రంగంలో ఇక్కడ యువత భాగస్వాములయ్యేలా ప్రోత్సహిస్తుందని అన్నారు. అయితే దీనిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యం త సున్నితమైన దేశ రక్షణకు సంబంధించిన సైనికుల శిక్షణ చివరకు ఇలా సిమెంట్ కంపెనీల చేతిలోకి వెళితే జాతీయ భద్రత మాటేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశ రక్షణకు నిలబడే సైనికుల శిక్షణ ఇలా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే పరిస్థితి ఏంటని నాయిని అనురాగ్ రెడ్డి ట్విటర్‌లోవివిధ పత్రికల కథనాలను ఊటంకిస్తూ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News