Tuesday, December 31, 2024

అదానీ విల్మార్ లాభం 67 శాతం వృద్ధి

- Advertisement -
- Advertisement -

ముంబై : మార్చి ముగింపు నాటి నాలుగో త్రైమాసిక ఫలితాల్లో అదానీ విల్మార్ లిమిటెడ్ నికర లాభం రూ.157 కోట్లతో 67 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.94 కోట్లుగా ఉంది. క్యూ4(జనవరి-మార్చి)లో కంపెనీ ఆదాయం రూ.13,342 కోట్లకు తగ్గింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.14,185.68 కోట్లుగా ఉందని స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో అదానీ విల్మార్ వెల్లడించింది. 202324లో కంపెనీ మొత్తం ఆదాయం రూ.51,555 కోట్లకు తగ్గింది, ఇది 2022-23లో రూ.59,148 కోట్లుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News