Friday, January 10, 2025

ఆసియాలో ఉత్తమ ఐపిఒగా అదానీ విల్మర్

- Advertisement -
- Advertisement -

కొద్ది రోజుల్లోనే మూడు రెట్లు పెరిగిన స్టాక్ విలువ

న్యూఢిల్లీ : ఆసియాలో కొత్తగా లిస్ట్ అయిన స్టాక్స్‌లో అదానీ విల్మర్ ఒకటి, ఈ ఫుడ్ కంపెనీ అద్భుతంగా మూడు రెట్లు రాబడిని ఇచ్చింది. స్టాక్‌మార్కెట్లలోకి ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే ఈ స్టాక్ మూడు రెట్లు పెరిగింది. బిలియనీర్ గౌతమ్ అదానీకు చెందిన అదానీ గ్రూప్, సింగపూర్‌కు చెందిన విల్మర్ ఇంటర్నేషనల్ సంస్థల జాయింట్ వెంచర్ అయిన అదానీ విల్మర్ ఇటీవల ఐపిఒకు వచ్చి బంపర్ హిట్ అయింది.

ఇప్పుడు పెట్టుబడిదారులకు మంచి లాభాలను అందిస్తోంది. ఆసియాలో వచ్చిన స్టాక్‌లలో అదానీ విల్మర్ అత్యుత్తమ రాబడిని ఇచ్చింది. కంపెనీ షేరు ధర రూ.230 చొప్పున 2022 ఫిబ్రవరిలో ఐపిఒతో ముందుకు వచ్చింది. ప్రస్తుతం రూ.700 వద్ద ట్రేడవుతోంది. ఆసియాలో అత్యధిక ఐపిఒలను తీసుకొచ్చిన కంపెనీల షేర్లు దిగువన ట్రేడవుతున్నాయి. ఆసియా ప్రాంతంలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ ఐపిఒలను తీసుకొచ్చిన కంపెనీల షేర్లు వాటి ఇష్యూ ధరల కంటే తక్కువ ధరలో ట్రేడవుతున్నాయి.

అదానీ విల్మార్ స్టాక్ మల్టీబ్యాగర్‌గా నిరూపించుకుంది. 2022 ఫిబ్రవరి 8న స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ అయినప్పటి నుండి కేవలం 107 రోజుల్లో 200 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది. ఈ షేర్ రూ.878 స్థాయిని కూడా తాకింది. గురువారం ఈ షేరు 5 శాతం లాభంతో రూ.698 వద్ద ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News