Wednesday, January 22, 2025

సిమెంట్ రంగంలో నం.1 అదానీ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

Adani’s group said to be in talks for Jaiprakash’s cement

 

న్యూఢిల్లీ : బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ దేశంలో సిమెంట్ రంగంలో ఆదిపత్యమే లక్షంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే గత నెలలో రూ.6.4 బిలియన్ డాలర్లతో స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్ గ్రూప్ నుంచి అంబుజా సిమెంట్స్, దాని అనుబంధ సంస్థ ఎసిసి లిమిటెడ్‌ను అదానీ గ్రూప్ విజయవంతంగా కొనుగోలు చేసింది. దీని తర్వాత ఇప్పుడు మరో సిమెంట్ కంపెనీ కొనుగోలుపై దృష్టిపెట్టింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జైప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్‌కు చెందిన సిమెంట్ యూనిట్‌ను సొంతం చేసుకునేందుకు గానూ అదానీ గ్రూప్ చర్చలు జరుపుతోంది. ఈమేరకు బ్లూమ్‌బర్గ్ ఓ కథనం వెలువరించింది. సిమెంట్ గ్రైండింగ్ యూనిట్, ఇతర చిన్న ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు గాను గ్రూప్ దాదాపు రూ.5 వేల కోట్ల చెల్లించనుందని నివేదికలు చెబుతున్నాయి. జైప్రకాష్ పవర్ వెంచర్స్‌కు చెందిన సిమెంట్ యూనిట్‌ను అదానీ కొనుగోలు చేయడం ద్వారా సిమెంట్ రంగంలోకి అదానీ గ్రూప్ ఆదిపత్య స్థాయికి చేరడంలో దోహదం చేస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News