Thursday, January 23, 2025

ఉద్ధవ్ థాకరేతో అదానీ సమావేశం

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలో ప్రపంచ శ్రీమంతుల్లో రెండో స్థానంలో ఉన్న వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతో సమావేశమయ్యారు. మరోవైపు శివసేన పార్టీని రెండు చీల్చడంతో పాటు పార్టీ రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి… మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వాన్ని బిజెపి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో థాకరేతో అదానీ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. థాకరేతో అదానీ సమావేశమైన విషయాన్ని అదానీకి కంపెనీలు వెల్లడించాయి. అయితే, వీరిద్దరూ ఏయే అంశాలపై చర్చించారు అనే దానిపై ఇప్పటివరకు బయటకు వెలువడలేదు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు గౌతమ్ అదానీ అత్యంత సన్నిహితుడిగా ఉన్న విషయం అందరికీ విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News