Monday, January 27, 2025

స్కిల్ యూనివర్శిటీకి అదానీ రూ. 100 కోట్ల నిధులు నిరాకరిస్తున్నాం: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ వార్తల్లోకి ఎక్కారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ కోసం ఎంతో మంది నిధులు ఇచ్చారని తెలిపారు. అదానీ సంస్థ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ. 100 కోట్ల రూపాయాలను ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ’ కి విరాళం ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే అదానీ ఇస్తానన్న రూ. 100 కోట్లను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ఆ డబ్బు బదిలీ చేయొద్దని అదానీ గ్రూప్ కు లేఖ రాసినట్లు కూడా తెలిపారు.

అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు సేకరించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అనవసర వివాదాల్లోకి తెలంగాణ ప్రభుత్వాన్ని లాగొద్దని అన్నారు. అంతేకాక ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వార్తలు రాయవద్దని మీడియా మిత్రులను  కూడా ఆయన కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News