Sunday, January 19, 2025

అదానీ కుమారుడు జీత్‌కు దివాతో నిశ్చితార్థం

- Advertisement -
- Advertisement -

ముంబై : భారతదేశంలో సంపన్న వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అదానీ, డైమండ్ వ్యాపారి కుమార్తె దివా జైమిన్ షా నిశ్చితార్థం ఆదివారం (మార్చి 12) జరిగింది. ఈ వేడుక గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

సి.దినేష్ అండ్ కో.ప్రైవేట్ లిమిటెడ్ వజ్రాల వ్యాపారి జమిన్ షా కుమార్తె దివా, అయితే పెళ్లి తేదీ గురించి ఇంకా సమాచారం వెల్లడించలేదు. జీత్, దివా జైమిన్ నిశ్చితార్థం చాలా గోప్యంగా ఉంచారు. అందువల్ల ఈ వేడుక సమాచారం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News