Monday, December 23, 2024

టిడిపికి సీనియర్ కార్యకర్త పవన్: అడపా శేషు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టిడిపి నేత లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మండిపడ్డారు. బాబు, లోకేష్, పవన్‌కి ప్రజల గురించి అవసరం లేదని, అర్జెంట్‌గా అధికారంలోకి రావాలన్నదే వారి ఆలోచన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల రక్తం పీల్చే వ్యక్తి చంద్రబాబు అని, ప్రజల కోసం తన రక్తాన్ని దారపోసే వ్యక్తి సిఎం జగన్ అని అడపా శేషు దుయ్యబట్టారు.

తన వ్యక్తిగత ప్రయోజనాలను మాత్రమే చూసుకునే వ్యక్తి పవన్ కల్యాణ్ అని ధ్వజమెత్తారు. జనసేన శ్రేణుల సమస్యలు కూడా పవన్‌కు అవసరం లేదన్నారు. పవన్‌కు కావాల్సింద్లా కేవలం చంద్రబాబు, లోకేష్ బాగోగులేనని, జనసేన పార్టీ పెట్టించిందని చంద్రబాబేనని తాము ఎప్పుడో చెప్పామన్నారు.

జనసైనికులు అప్పుడు నమ్మలేదు కానీ ఇప్పుడు బాధపడుతున్నారని, పవన్ సీనియర్ టిడిపి కార్యకర్తలా తయారయ్యాడని అడపా శేషు ఎద్దేవా చేశారు. పవన్ చేస్తున్న పనులతో జనసైనికులు అవమానంతో కుమిలిపోతున్నారని, చంద్రబాబు లేకపోతే తన మనుగడ సాగదని పవన్ ఆలోచన చేస్తున్నారని దుయ్యబట్టారు. కాపులకు ప్రాధాన్యం కల్పించింది వైఆర్‌ఎస్ కుటుంబమే అనిన శేషు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News