Monday, January 27, 2025

ఆకట్టుకుంటున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

Adavallu Meeku Johaarlu Trailer Released

హైదరాబాద్: యంగ్ హీరో శర్వానంద్, యంగ్ బ్యూటీ రష్మికా మందన్న జంటగా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీకి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్స్ రాధిక శరత్ కుమార్, ఖుష్బూ, ఊర్వశి తోపాటు బ్రహ్మానందం, బెనర్జీ, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మార్చ్ 4న థియేటర్లో విడుదల కానుంది.

Adavallu Meeku Johaarlu Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News