Thursday, January 23, 2025

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

Adavallu meeku joharlu release on feb 25

 

యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కానుందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చేట్టుగా కనిపిస్తున్న ఈ చిత్రంలో మొదటసారిగా రష్మిక, శర్వానంద్‌లు కలిసి నటించారు. ఖుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ స్క్రీన్ మీద కొత్తగా ఉండబోతోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అధ్బుతమైన సంగీతం అందిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News