Thursday, December 19, 2024

బిఆర్ఎస్ బిజెపివి రాజకీయ డ్రామాలు: దయాకర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి బిఆర్ఎస్ పార్టీలు రాజకీయంగా డ్రామాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. గురువారం అద్దంకి మీడియాతో మాట్లాడారు. వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పట్టించుకోకుండా బిజెపి బిఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్‌ను కాపాడేందుకే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిరసన తెలిపారని చురకలంటించారు. డబుల్ బెడ్ రూమ్ డ్రామాలు ప్రజలు హర్షించరని, తొమ్మిది సంవత్సరాల తర్వాత బిజెపికి డబుల్ బెడ్ రూమ్ గురించి ఇప్పుడు గుర్తొచ్చాయా? అని ప్రశ్నించారు. ముంపు ప్రాంతాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: సిఎం కెసిఆర్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News