Friday, January 3, 2025

రాముడు మీకు చిన్నాయనా?… సీత మీకు చిన్నమ్మనా?.. ఘాటు వ్యాఖ్యలు చేసిన అద్దంకి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హిందువులు, శ్రీరాముడిపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్‌లో జరిగిన రాహుల్ గాంధీలో అద్దంకి ప్రసంగించారు. తెలంగాణలో తాము హిందువులం, హిందువులం అని అంటున్నారని, రాముడు మీకు చిన్నాయానా… సీత మీకేమైనా చిన్నమ్మనా మీరేమైనా రాముడి వంశంలో పుట్టారా? అని అద్దంకి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు, రాముడు ఏం చేశాడు వీరికి తెలియదంటూ అద్దంకి ఎద్దేవా చేశారు. దీంతో అద్దంకిపై బిజెపి శ్రేణులు, ఆర్‌ఎస్‌ఎస్ వాదులు మండిపడుతున్నారు. హిందువులను కించపరిచినందుకు అద్దంకిపై చర్యలు తీసుకోవాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల సమయంలో దయాకర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. హిందూ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అని బిజెపి విమర్శలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ను ఇరకాటంలోని పడేసినట్టుగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News