Sunday, January 19, 2025

సినిమా ఆడియో లాంచ్‌కు రండి… మంత్రి కోమటిరెడ్డికి అద్దంకి ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ శనివారం రాష్ట్ర, రోడ్లు భవనాలు, సినీమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిశారు. తాను నటిస్తున్న సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ ఆహ్వానించారు. గతంలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కోమటిరెడ్డిపై అద్దంకి చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కొంతకాలం వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో, కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరిణామాల్లో భాగంగా వారిద్దరూ కలిసిపోయారు. తాజాగా తన సినిమా ఆడియో లాంచ్‌కు రావాలని కోమటిరెడ్డిని అద్దంకి ఆహ్వానించడం అందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News