Friday, February 14, 2025

తెలంగాణను క్యాసినో హబ్‌గా కెటిఆర్ మార్చారు:అద్దంకి దయాకర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణను క్యాసినో హబ్‌గా కెటిఆర్ మార్చారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఆధునిక హంగులతో విదేశాల్లో ఆడే క్యాసినో, జూదాలు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఫాంహౌస్‌లో జరగడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ కెటిఆర్ బావమరిది ఇంట్లో ఓ పార్టీలో కొకైన్ పట్టుబడిందని ఆయన గుర్తు చేశారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫాంహౌస్‌లో జరుగుతున్న అక్రమాలకు ముమ్మాటికీ బాధ్యుడు కెటిఆర్ అని ఆయన ఆరోపించారు. దీనికి కెటిఆర్ కూడా శిక్షార్హుడేనని ఆయన తెలిపారు. దొంగలకు లీజుకు ఇస్తే వాళ్ళు దొంగలే అవుతారన్నారు. సూరత్ పోర్టు నుంచి తెలుగు రాష్ట్రాలకు గంజాయి వస్తుందని ఆయన ఆరోపించారు.

ఇక పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్‌లో భాగంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫాంహౌస్ గుట్టు బయట పడిందన్నారు. పిసిసి హోదాలో రేవంత్ వైట్ చాలెంజ్ చేస్తే కెటిఆర్ హైకోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. కెసిఆర్ కుటుంబంలో నలుగురు వాళ్ల కోసం మాత్రమే పోరాటం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. బిఆర్‌ఎస్ హయంలో ఇచ్చిన పర్మిషన్‌తో రెండేళ్ల నుంచి ఈ పందెలు జరుగుతున్నాయన్నారు. పది మంది ఎమ్మెల్యేలు ఎందుకో పార్టీ ఫిరాయించారో ఇప్పటికైనా అర్ధం చేసుకోవాలన్నారు. హీరో కావడానికి కెటిఆర్ జీరో పనులు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. నాలుగేళ్ల తర్వాత కూడా కెసిఆర్ బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News