Sunday, January 19, 2025

బిజెపితో బిఆర్‌ఎస్ సుపారీ : అద్దంకి దయాకర్

- Advertisement -
- Advertisement -

గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, అవినీతి, అక్రమాల వల్ల సుపారీ రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి బిజెపికి ఏర్పడిందని కాంగ్రెస్ నేత, టిపిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బిఆర్‌ఎస్ సుపారీ తీసుకొని బిజెపితో అగ్రిమెంట్ చేసుకుందని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికల్లో బిజెపి కోసం బిఆర్‌ఎస్ పనిచేస్తుందన్నారు. కెసిఆర్ ఎక్కడ తగ్గినా ఎక్కడ పెరుగుతున్నా అది బిజెపి కోసమేనని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్, బిజెపిలు కలిసి కాంగ్రెస్‌కు నష్టం కలిగించాలని కొన్ని నియోజకవర్గాల్లో కక్ష గట్టి బిఆర్‌ఎస్ రాజ కీయాలు చేస్తుందన్నారు. ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇలాంటి రాజకీయాలతో కెసిఆర్ సొంత పార్టీనే నా శనం అవుతుందన్నారు. నష్టపోతుందని తెలిసినా కూడా కెసిఆ ర్ ఏమాత్రం తగ్గడం లేదని దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News