Wednesday, January 22, 2025

అవినీతిలో కెసిఆర్ ప్రాత ఉందనగానే గుబులెందుకు:అద్దంకి దయాకర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఎర్పడినప్పటి నుండి ప్రజలు సేవలు చేయాల్సిన శాఖలను తన గుప్పెట్లో పెట్టుకొని ఆడింది ఆట.. పాడింది పాట.. అన్నచందాన నిర్వహించిన మీరు అవినీతిలో కెసిఆర్ పేరుందనగానే గుబులు పడుతున్నారని కా్రంగెస్‌పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ పేరును ప్రభుత్వం బదనాం చేస్తుందనడంలో ఎలాంటి అర్థం లేదని ఆయన స్పష్టం చేశారు. అన్నీ చేసింది మీరే కదా..? మరి ఇప్పుడెందుకు భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిందంతా చేసి ఇప్పుడు విచారణలో పేరు రాగానే కేసీఆర్ ఇబ్బంది పడుతున్నారని, బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రులు చేసింది ఏముంది.. అంతా మీరే కదా చేసింది. కేసీఆర్ బెదిరించే ధోరణి సరికాదు. విచారణ ముందుకు సాగకుండా చేసే పని చేయొద్దు. ప్రజలకు ఇప్పటికైనా వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే విచారణకు ఆదేశించాం. ఎవరినో నిందితులుగా చేయడానికి కాదని దయాకర్ స్పష్టం చేశారు.

కాగా.. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయడాన్ని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యతిరేకించారు. ఈ మేరకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్‌కు ఆయన లేఖ కూడా రాశారు. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై కెసిఆర్ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. అన్నిరకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకు వెళ్లామని తెలిపారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా? అని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లల్లో విద్యుత్ సంక్షోభం విపరీతంగా ఉందని, ఇది జగమెరిగిన సత్యం అని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేసీఆర్కు కమిషన్ నోటిస్ జారీ చేసింది.. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున జులై 30వ తేదీ వరకు వివరణకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ కోరగా.. కమిషన్ మాత్రం జూన్ 15 వరకు గడువు ఇచ్చిన ఈ నేపథ్యంలో కమిషన్కు 12 పేజీల లేఖ కేసీఆర్ రాశారు..

కెసిఆర్ భయపడుతున్నారు : వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌గౌడ్
కెసిఆర్ చేసిన తప్పులన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తుండటతో ఆయనలో భయం మొదలైందని, చేసిన తప్పులు బయటకు వచ్చి ప్రజలకు తెలుస్తాయని.. తప్పులకు శిక్ష పడుతుందనే అని భయం పట్టుకుందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు. విచారణ కమిషన్ నోటీసులు జారీ చేస్తే 12 పేజీల లేఖ రాశావు.. అదే కమిషన్ ముందు వెళ్లి చెప్పుకోవచ్చు కదా తప్పు చేయకపోతే… కమిషన్ ముందు నిరూపించుకో . విద్యుత్ కొనుగోలు పెద్ద కుంభకోణం . అక్రమాలు బయటకు రావాలి ప్రజలకు నిజాలు తెలియాలని, కేసీఆర్ విచారణకు హాజరుకావాల్సిందే అని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News