Thursday, December 19, 2024

కెసిఆర్ పూర్తిగా చంద్రముఖిలా మారిపోయాడు : అద్దంకి దయాకర్

- Advertisement -
- Advertisement -

మాజీ సిఎం కెసిఆర్ పూర్తిగా చంద్రముఖిగా మారి రెండు టాస్క్‌లు పెట్టారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ కుట్రలన్నీ కేటీఆర్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పామ్ హౌస్‌లో కూర్చొని చేస్తున్న రాజకీయ కుట్రలకు రూపంగా కేటీఆర్ మారుతున్నారని విమర్శించారు.

ఒకటి ప్రభుత్వాన్ని ఎట్లా బదనం చేయాలి, రెండోది కొడుకును ఎలా ఛాంపియన్ చేయాలని చూస్తున్నారని వెల్లడించారు. ఆయన కడుపులో మంటలకు కేటీఆర్ పొగరూపంగా కనిపిస్తున్నారని గమనించాలని తెలిపారు. అధికారం చేజారి ఏడాది కూడా కాకముందే మళ్ళీ అధికార దాహంతో ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులపై జరిగిన దాడిని కూడా సమర్థించుకుంటున్నారంంటే వీళ్ళను ఏమనాలని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News