Wednesday, January 8, 2025

ప్రజల సొమ్ము తిన్నోళ్లు జైలుకు వెళ్లాల్సిందే.. కెటిఆర్ పై అద్దంకి ఫైర్

- Advertisement -
- Advertisement -

ఫార్ములా ఈ కారు రేసు కేసులో విచారణకు డుమ్మా కొట్టిన మాజీ మంత్రి కెటిఆర్ పై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఫైరయ్యారు. తన లాయర్ ను అనుమతిస్తేనే విచారణకు హాజరవుతానన్న కెటిఆర్ ఏసిబి ఆఫీస్ నుంచి తిరిగి వెళ్లిపోయారు. దీనిపై స్పందించిన అద్దంకి.. కేటీఆర్, ముద్దాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో లాయర్లకు అనుమతిచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజల కోసం కోట్లాడతాం అంటున్నారని.. ప్రజల తరపున కొట్లాడి దోచుకోమన్నారా? అని అద్దంకి దుయ్యబట్టారు. ప్రజల సొమ్ము తిన్నోళ్లు అరెస్ట్ కావాల్సిందే.. జైలుకు వెళ్లాల్సిందేనని అద్దంకి దయాకర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News