Friday, January 3, 2025

మందుల శామ్యూల్ గెలుపు కోసం పని చేస్తా: అద్దంకి దయాకర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తెలిపారు. తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల శామ్యూల్ గెలుపు కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. అధిష్టానం నిర్ణయం వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని ఆయన చెప్పారు. తన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధైర్యపడొద్దని, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని సూచించారు. తుంగతుర్తి నియోజవర్గంలో 2014, 2018లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి స్వల్ప మెజార్టీతో అద్దంకి దయాకర్ ఓడిపోయిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News