Sunday, February 2, 2025

మత్తుకి బానిసై,  కిరాతకానికి ఒడిగట్టి…ఆపై ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. మాదకద్రవ్యాలకు బానిసైన వ్యక్తి తన యావత్ కుటుంబాన్ని పొట్టనపెట్టుకున్నాడు. పోలీసుల సమచారం ప్రకారం లక్నోకు దాదాపు 90 కిమీ. దూరంలోని సీతాపూర్ లోని రాంపూర్ మధురలోని పల్హాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అనురాగ్ సింగ్(45) మద్యానికి, మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు. మానసికంగా దెబ్బతిన్నాడు. అతడి కుటుంబం అతడిని డీఅడిక్షన్ కేంద్రానికి తరలించాలని భావించింది. కానీ అతడు ఈ విషయంలో కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు. మత్తులో ఉండగా, కోపంతో ఉన్మాదిగా మారిపోయి తన కుటుంబ సభ్యులను చంపేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు తన తల్లి సావిత్రి దేవి(60), భార్య ప్రియాంక దేవి(40), తన ముగ్గురు చిన్నపిల్లలు 12,9,6 ఏళ్ల పిల్లలను పొట్టనపెట్టుకున్నాడు. సీతాపుర్ అదనపు పోలీస్ సూపరింటెండెంట్ ప్రవీణ్ రంజన్ సింగ్ ఈ వివరాలను వెల్లడించారు.

Murders

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News