Tuesday, January 21, 2025

నాభార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య బుష్రా బీబీకి టాయిలెట్ క్లీనర్ కలిపిన ఆహారం ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విషపూరిత ఆహారం తిన్న వెంటనే ఆమె కడుపునొప్పితో బాధపడుతున్నారని, ఆరోగ్యం క్షీణిస్తోందన్నారు. 190 మిలియన్ పౌండ్ల అవినీతి కేసు విచారణలో భాగంగా ఆయన న్యాయమూర్తి ఎదుట ఈ ఆరోపణలు చేశారు.

ఆమెకు తగిన వైద్య పరీక్షలు చేయించడం లేదని, తాను ఎవరితోనూ మాట్లాడే పరిస్థితి లేకుండా అదనంగా బ్యారెల్స్ ఏర్పాటు చేశారన్నారు. అలాగే కస్టడీలో ఉన్నప్పుడు మీడియాతో మాటలు తగ్గించుకోవాలని విచారణ సందర్భంగా ఇమ్రాన్‌కు న్యాయమూర్తి సూచించారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నందున స్పష్టత ఇవ్వడం కోసం తాను వారితోమాట్లాడుతున్నట్టు మాజీ ప్రధాని తన వాదన వినిపించారు.

ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం కూడా ఇమ్రాన్ ఇదే తరహా ఆరోపణలు చేశారు. బుష్రా అరెస్టుకు ఆర్మీచీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కారణమని వ్యాఖ్యలు చేశారు. ఆమెకు శిక్ష విధించిన న్యాయమూర్తే తనతో మాట్లాడినట్టు తెలిపారు. ఒకవేళ తన భార్యకు ఏదైనా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. తాను బతికి ఉన్నంత వరకు మునీర్‌ను వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఆయన తీసుకుంటున్న రాజ్యాంగ విరుద్ధ, అక్రమ నిర్ణయాలను బహిర్గతం చేస్తానన్నారు. బుష్రా ప్రస్తుతం ఓ అవినీతి కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇస్లామాబాద్ శివారు లోని నివాసంలో గృహ నిర్బంధంలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News