న్యూఢిల్లీ : ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలోని ఇండియన్ ఇంగ్లీష్‌లో మరో 800 పదాలు కొత్తగా వచ్చి చేరాయి. సామాన్యంగా వాడుకలో ఉన్న దేశ్ ( కంట్రీ) బిందాస్ ( ధైర్యం) వంటి వివిధ పదాలను డిక్షనరీలో చేర్చారు. ప్రపంచ స్థాయిలో వాడే 16 రకాల ఉచ్ఛారణను డిక్షనరీలో చేర్చారు. అవి ఎలా ఉచ్ఛరించాలో ఆడియో రికార్డు కూడా చేశారు.
ఈ ప్రపంచ ఇంగ్లీష్ ఉచ్ఛారణకు సంబంధించిన ఆడియో భాండాగారంలో దేశం లోని ఇండియన్ ఇంగ్లీష్ మాట్లాడే 130 మిలియన్ మంది ఉచ్ఛారణల శబ్దాల ఆడియోలను పొందుపరిచినట్టు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ వివరించింది. దియా (దీపం), బచ్చా (పిల్లవాడు,పెంపుడు జంతువు) అల్మరా (స్టాండింగ్ కప్‌బోర్డ్) తదితర పదాలు కూడా డిక్షనరీలో చేరాయి. ప్రపంచ స్థాయిలో వివిధ రకాల ఇంగ్లీష్ పదాల ఉచ్ఛారణను గ్రహించి డిక్షనరీలో పదాలను విస్తరించే ప్రక్రియ 2016 నుంచి ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ కొనసాగిస్తోంది.