Monday, December 23, 2024

రాష్ట్రంలో మరో 14,565 ఇంజినీరింగ్ సీట్లు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో మరో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతోపాటు ఒకటి రెండు రోజుల్లో ఇంటర్మీడియేట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మా ర్పులు చోటుచేసుకున్నాయి. అర్హులైన విద్యార్థులంతా మొదటి విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. గురువారంతో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కావాల్సి ఉండగా, శుక్ర, శనివారాలలో ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. ఈ నెల 9వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ంటుంది. వెబ్ ఆప్షన్ల నమోదు గడువు ఈనెల 12వరకు పొడిగించారు. 16న తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయించనున్నారు. ఈ నెల 24 నుంచి రెండో విడత,

ఆగస్టు 4 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ఉంటుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ షెడ్యూల్‌లో పేర్కొన్నారు. మరో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య 1,00,671కి చేరింది. కోర్ గ్రూపుల్లో సీట్లు వెనక్కి ఇస్తామని పేర్కొంటూ ఇంజినీరింగ్ కాలేజీలు కంప్యూటర్ కోర్సుల్లో సీట్లకు అనుమతి కోరాయి. దీంతో 6,930 సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే కొత్తగా 7,635 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఖరారు చేసింది. ఫలితంగా అదనపు సీట్లతో ఏటా సర్కారుపై రూ. 27.39 కోట్ల భారం పడనుంది. ఇటీవల 86,106 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, తాజాగా అనుమతిచ్చిన వాటితో కలిపి రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య 1,00,671కి చేరింది.

ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్

మొదటి విడత

జులై 7,-8 తేదీలలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్‌కు అవకాశం
జులై 9న సర్టిఫికెట్ వెరిఫికేషన్
జులై 12 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
జులై 16న మొదటి విడత- సీట్ల కేటాయింపు
జులై 16 – నుంచి 22 వరకు సీట్లు పొందిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి

రెండో విడత
జులై 24,25 తేదీలలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్‌కు అవకాశం
జులై 26న సర్టిఫికెట్ వెరిఫికేషన్
జులై 24 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
జులై 31న రెండో విడత- సీట్ల కేటాయింపు
జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు సీట్లు పొందిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి

తుది విడత

ఆగస్టు 4న ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్‌కు అవకాశం
ఆగస్టు 5న సర్టిఫికెట్ వెరిఫికేషన్
ఆగస్టు 4 నుంచి 6 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
ఆగస్టు 9న రెండో విడత- సీట్ల కేటాయింపు
ఆగస్టు 9 నుంచి 11 వరకు సీట్లు పొందిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు కాలేజీల్లోనూ రిపోర్టు చేయాలి

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News