Saturday, November 16, 2024

డీలర్లపై అదనపు భారం

- Advertisement -
- Advertisement -

Additional burden on ration dealers in Telangana

తగ్గుతున్న దుకాణాలు, పెరుగుతున్న కార్డులు
కార్డుల సంఖ్య పెరగడంతో ఇబ్బందులు పడుతున్న డీలర్లు
మృతి చెందిన వారి స్థానంలో కొత్తవారిని నియమించాలి
గత ఏడాదిగా అదనంగా విధులు నిర్వహిస్తున్నమని ఆవేదన

హైదరాబాద్: నగరంలో పేదలకు నెలవారీగా రేషన్ పంపిణీ చేసే డీలర్లు అదనపు భారంతో సరుకులు సకాలంలో లబ్దిదారులకు పంపిణీ చేయలేకపోతునామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో వైరస్ బారిన పడి కొంతమంది డీలర్లు మృత్యువాత పడటంతో వారి అందజేసే సరుకులు పక్క డీలర్లు ఇవ్వాల్సి వస్తుందని, దీంతో గత ఏడాదిన్నర నుంచి ఎక్కువ గంటలు దుకాణాల్లో ఉండాల్సి వస్తుందని పలువురు డీలర్లు పేర్కొంటున్నారు. రెండేళ్ల కితం ఒక డీలర్లు సుమారు 550 నుంచి 600 కార్డుదారులకు రేషన్ పంపిణీ చేసామని, ప్రస్తుతం నెలకు ఒక రేషన్ దుకాణంలో 850 కార్డులకు సరుకులు అందజేస్తున్నామని చెబుతున్నారు. చనిపోయిన వారి స్దానంలో కొత్త డీలర్లను నియమిస్తే తమకు అదనపు భారం తగ్గుతుందని, కొత్త ఏడాదిలోనైనా పౌరసరఫరాల అధికారులు ఆదిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఎక్కువ కార్డులకు రేషన్ ఇవ్వడంతో జనం రద్దీ ఉంటున్నారని, దీనికి తోడు బయోమెట్రిక్ మిషన్ల మొరాయింపు, ఓటిపి నెంబర్ వచ్చిన లబ్దిదారులు తప్పుగా చెప్పడం, మరికొందరు ఆలస్యంగా చెప్పడంతో ఒక కార్డు 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుందని దీంతో రోజంతా రేషన్ షాపుల్లో గడపాల్సి వస్తుందని వెల్లడిస్తున్నారు. అంతేగాకుండా గతంలో ఉన్నట్లు రేషన్ కార్డులు లేకపోవడంతో లబ్దిదారులు ఆన్‌లైన్‌లో కార్డు వివరాలకు సంబంధించిన పత్రాలు తీసుకొస్తుండటంతో వాటిలో సక్రమంగా కార్డు నెంబర్ లేకపోవడంతో కార్డు నిర్దారణ చేసుకోవడానికి కొంత సమయం పట్టడంతో కార్డుదారులను నిలబెట్టాల్సి వస్తుందని డీలర్లు చెబుతున్నారు. నగరంలో 975 దుకాణాలుండగా, ప్రస్తుతం 876 రేషన్ షాపులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 150పైగా దుకాణాలు మూత పడటంతో వాటికి సంబంధించిన సరుకులు ఇవ్వడంతో అదనపు బారంతో ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వివరిస్తున్నారు.

వైరస్ రెండో దశ ప్రారంభమైన మార్చి నుంచి ఉచితంగా ప్రతి ఒకరికి 10 కిలోల చొప్పన ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తుండటంతో ప్రతి కార్డు సరుకులు తీసుకుంటున్నారు. రూపాయి కిలో చెల్లించి తీసుకునే సమయంలో కొందరు సరుకులకు దూరంగా ఉన్నారని, ఉచితం బియ్యంతో వినియోగదారులు బియ్యం తీసుకుని బ్లాక్‌మార్కెట్‌లో దర్జాగా రూ. 8లకు కేజీ చొప్పన అమ్మకాలు చేస్తూ రేషన్ బియ్యం రాష్ట్రాలు దాటిస్తున్నారు. గతంలో కొత్త రేషన్ దుకాణాలపై ప్రభుత్వం ఒక ప్రదిపాదనలు తీసుకొచ్చి రిజర్వేషన్ల ప్రకారం దుకాణాలు కేటాయించేందుకు ఏర్పాట్లు చేయగా, కొంతమంది డీలర్లు కార్డుల పంపిణీ విషయంలో అభ్యంతర వ్యక్తం చేశారు. దీంతో కొత్త దుకాణాల కేటాయింపు వాయిదా పడింది. త్వరలో ఒక నిర్ణయం తీసుకుని మూడు నెలల్లో భర్తీ చేస్తామని పౌరసరఫరాలు వెల్లడిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News