కోహెడ: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి, నాగసముద్రాల గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సోమవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ ప్రకియలో భాగంగా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ కోహెడ మండలంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామాలభివృద్ధిలో ప్రభుత్వం చూపిన మార్గదర్శకాలను జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అమలు చేసిన తీరును అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. మురుగు కాల్వలు, రోడ్లు, వీధుల పరిశుభ్రత, దోమల నివారణకు తీసుకుంటున్న చర్యలు, కార్యాలయ రికార్డుల నిర్వహణ, డంపింగ్ యార్డు వినియోగం, కంపోస్ట్ తయారీ, వైకుంఠధామాల నిర్వహణ, తడి, పొడి చెత్త సేకరణ, వంద శాతం పన్నుల వసూళ్లు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల నిర్వహణ, తదితర అంశాలను పరిశీలించి, సంతృఫ్తి వ్యక్తం చేశారు. కాగా వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన వింతంతు మహిళలు చాలా నెలలుగా పెన్షన్ రావడం లేదని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌కు మోర పెట్టుకున్నారు. ప్రస్తుతం పె న్షన్ పోర్టల్‌లో నమోదు ప్రక్రియ లేదని, నమోదు ప్రక్రియ ప్రారంభం కాగానే అర్హులైన వారందరికి పెన్షన్ వస్తాయని అడిషనల్ కలెక్టర్ చెప్పారు. జడ్పి సిఇవో రమేష్, డిపివో దేవకి దేవి, ఎంపిడివో మధుసూదన్, ఎంపివో సురేష్ సంబంధిత అధికారులున్నారు.
అభివృద్ధి పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -