Monday, December 23, 2024

నాంచారుపల్లి పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ విద్యార్థులతో ఇంట్రాక్ట్ అయ్యారు. పాఠాలు చెప్పి ప్రశ్నలు అడిగారు. పాఠశాలల్లో అమలవుతున్న పఠనోత్సవ కా ర్యక్రమాన్ని సిద్దిపేట అర్బన్ మండలం నాంచారుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠాలు చెప్పి ఉపాధ్యాయుడుగా మా రారు. విద్యార్థులతో పాటు అడిషనల్ కలెక్టర్ కూర్చుని వారితో మచ్చటించి పాఠం చెప్పి అందులో నుంచి ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు.

చిన్నారులుచెప్పిన జవాబులకు అడిషనల్ కలెక్టర్ మురిసిపోయారు. పిల్లలను ఆలోచించే విధంగా కథ చెప్పి కథలోని అంశాలను రాబట్టారు. తెలుగు, ఇంగ్లీష్ పాఠాల ను చదివించారు. విద్యార్థుల స్థాయిని తెలుసుకొని సంతృప్తి వ్య క్తం చేశారు. ఆయన వెంట సెక్టోరియల్ ఆఫీసర్ బాస్కర్, రూ మ్ టు రీడ్ ప్రతినిధి సీహెచ్ రవీందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మావతి, ఉపాధ్యాయులు మల్లికార్జున్ రెడ్డి, స్ర వంతి, దేవరాజు, సుజాత, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News