Sunday, December 22, 2024

నాగారం ఎబిసి కేంద్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్

- Advertisement -
- Advertisement -

కీసర: నాగారం మున్సిపాలిటీలో నిర్మాణంలో ఉన్న జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని (ఎబిసి) మంగళవారం జిల్లా స్థానిక సం స్థల అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్తా సందర్శించారు. పట్టణంలో కుక్కల నియంత్రణ కోసం చేపట్టిన జంతు జనన నియంత్రణ కేంద్రం (ఎబిసి)లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శునకాలకు జనన నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

అనంతరం అదనపు కలెక్టర్ మున్సిపాలిటీ పరిధిలోని డిఆర్‌సి (డ్రై రిసోర్స్ సెంటర్)ని సందర్శించారు. పొడి వనరుల కేంద్రం నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వాణిరెడ్డి, డిఈఈ సుదర్శనం రఘు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News