Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతికి నివాళులార్పించిన అదనపు డిసిపిలు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ క్రైం : బాల్కొండ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎం. జలంధర్ హోంగార్డును బుధవారం ద్విచక్ర వాహనంపై వెళ్లే సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనగా హుటాహుటిన నిజామాబాద్‌లోని మనోరమ హాస్పిటల్‌కు తరలించి చికిత్స నిర్వహిస్తుండగా అర్ధరాత్రి సమయంలో మృతి చెందారు. మృతుడి స్వస్థలం తాళ్లరాంపూర్, మృతునికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.

గురువారం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలోని పోస్టుమార్టం గది వద్ద నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషన్ (ఎల్ అండ్‌ఓ) ఎస్. జయరాం మరియు అదనపు పోలీసు కమిషనర్ పి. గిరిరాజు (ఎఆర్) హాజరై పుష్పగుచ్చాలతో నివాళులార్పించి మౌనం పాటించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంత్యక్రియల్లో రిజర్వు ఇన్స్‌పెక్టర్ వెంకటప్పల నాయుడు, ఏర్గట్ల ఎస్సై మచ్చేందర్ రెడ్డి, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News