Friday, December 20, 2024

జిహెచ్ఎంసి పరిధిలో అదనపు ఎంఎంటిఎస్ రైళ్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జిహెచ్ఎంసి(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) పరిధిలో అదనపు ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా 40 ఎంఎంటీఎస్ సర్వీసులను దక్షిణమధ్య రైల్వే తీసుకువచ్చింది. సికింద్రాబాద్- మేడ్చల్ మధ్య కొత్తగా 20 ఎంఎంటీఎస్ సర్వీసులు, ఫలక్ నుమా- ఉందానగర్ మధ్య కొత్తగా 20 ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య 106కు చేరింది. మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News