Thursday, January 23, 2025

బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: కాంగ్రెసోల్లు గ్రామాల్లోకి వస్తే తిరగబడండి అని ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు పత్రాప్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆదివారం గజ్వేల్ పట్టణంలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో వర్గల్ మండల పరిధిలోని మీనాజీపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి బిఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల విద్యుత్ వద్దు, రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాలలో తిరగనివ్వకుండా రైతులు, యువకులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ వాళ్ల మీనాజీపేటలో కాంగ్రెస్ ఖాళీ అయిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గ్రామ యువకులు , కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున బిఆర్‌ఎస్‌లో చేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ నుంచి బిఆర్‌ఎస్‌లో చేరిన వారిలో ప్రసాద్, కుమార్, చరణ్, దనుష్, సునీల్, రమేశ్, సంతోష్, నాగరాజు, శ్రీనివాస్, కృష్ణ, ఎల్లయ్య తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వర్గల్ మండల పార్టీ అధ్యక్షుడు వేలూరు వెంకట్ రెడ్డి, ఎంపిపి లతా రమేశ్ గౌడ్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వెంకట్, సర్పంచ్ సత్యం, టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుమార్, నగేశ్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News