Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

మద్నూర్: మండలంలోని ఆవల్‌గాం గ్రామానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ వార్డు మెంబర్లు, కార్యకర్తలు, యువకులు మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సిఎం కెసిఆర్ గ్రామ గ్రామాన సంక్షేమ పథకాలు, అభివృద్ధి చేపడుతున్నారన్నారు. జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధ్దికి సిఎం కెసిఆర్ సహకారంతో అహర్నిశలు పాటు పడుతున్నామన్నారు.
యువత, ప్రజలు, మహిళలు బీఆర్‌ఎస్ పార్టీ వైపే ఉన్నారని, రాబోయే రోజుల్లో జుక్కల్ నియోజకవర్గంలో మరింత అభివృద్ధ్ది పరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల పార్టీ అధ్యక్షుడు బన్సీ పటేల్, సర్పంచ్‌లు సురేష్, గఫార్, శాంతేశ్వర్, ఎంపిటిసి సాయిలు, ఉప సర్పంచ్ మారుతీ, నగేష్, విజయ్, యువకులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News