Wednesday, December 25, 2024

బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

దుగ్గొండి: బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు నియోజకవర్గంలోని ఎంతో మంది ఆకర్షితులై ఎంతో మంది గులాబి గూటికి చేరడం జరుగుతుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. సిఎం కెసిఆర్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జనం బలంగా నమ్ముతున్నారన్నారు. ఈ నమ్మకంతోనే దుగ్గొండి మండలం రేబల్లె గ్రామానికి చెందిన కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన 25 కుటుంబాలు బీఆర్‌స్‌లో చేరినట్లు తెలిపారు.

పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రేబల్లె మాజీ సర్పంచ్, క్లస్టర్ బాధ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వార్డుసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

* ఖానాపురంలో.. అశోక్‌నగర్ గ్రామం కాంగ్రెస్ పార్టీకి చెందిన వర్షాల సురేష్, నీరడు ఉప్పలయ్య, పర్షాల నరేశ్, సునారి, సురేష్, గోగు సతీష్, బొంతల వెంకటయ్య, బండారి రవి, బసనబోన బయ్యాలు, మొగిలి ప్రసాద్, మేకల ఉపేందర్, ఆమడగాని సాంబయ్య, ఐలయ్యలతోపాటు పలు కుటుంబాలు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ ఛైర్మన్ గుగులోతు రామస్వామినాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాష్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకటనర్సయ్య, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, క్లస్టర్ బాధ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వార్డుసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

* చెన్నారావుపేటలో.. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో లింగాపురం నుంచి కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, బాలకృష్ణ, రాజు, మహేందర్, సాంబయ్య, ఎం. సాంబయ్య ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు ఆకర్షితులై బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సురేష్, ఎంపీటీసీ పసునూటి రమేశ్, ఉపసర్పంచ్ వేములపల్లి రాజు, వార్డుసభ్యులు సంధ్యా, రంజీత్, రాములు, రాజు, భాస్కర్, బిక్షపతి, రాములు, రమేశ్, రఘు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News