Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

చేర్యాల: సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన పలువురు నాయకులు చేర్యాల ఎంపిపి ఉల్లంపల్లి కరుణాకర్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ మేరకు ఎంపిపి కర్ణాకర్ బిఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి వారిని ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో శబాసిగూడం ఉపసర్పంచ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఏదుల కనకయ్య, బిజెపికి చెందిన గంధాల వెంకటేష్, కాంగ్రెస్ పార్టీకి చెందిన నర్సింలు,స్వామితో పాటు 20 మంది సీనియర్ నాయకులున్నారు. శభాష్ గూడం సర్పంచ్ బొడ్డు స్వప్న కిరణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు గుద్దేటి కనకయ్య, బోదాసు రాజు, గజ్జి కనకయ్య, శ్రీరాముల కనకయ్య, మల్లిగారి దుర్గయ్య, రాములు, ప్రభాకర్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News