Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్: ఖేడ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం కంగ్టి మండలంలోని తుర్కవడ్‌గాం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. గ్రామంలోని 9వ వార్డు సభ్యులు నాగప్ప, మానికప్ప, దయానంద్, శర్ణప్ప, అబ్రహం, పవన్, హన్మంతు మరియు కుటుంబ సభ్యులు బిఆర్‌ఎస్‌లో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జరుగుతున్న అభివృద్ది చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో సిర్గాపూర్ మండల ఎంపిపి జార మహిపాల్‌రెడ్డి, జడ్పిటిసి రాఘవరెడ్డి, వైస్ ఎంపిపి మాధవరావు, సర్పంచ్ రాజు, పార్టీ సీనియర్ నాయకులు గూలే రాజప్ప, బసన్ని, దిలీప్, తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News