Friday, January 10, 2025

బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

యాచారం: మండలంలోని అనుబంధ గ్రామమైన గాండ్లగూడకు చెందిన సుమారు 50 మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బుధవారం మండల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కర్నాటి రమేశ్‌గౌ డ్, పాశ్చబాషల ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. నూతనంగా చేరి న వారికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరిగే వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారోజు శ్రీనివాస్‌చారి, వార్డు సభ్యులు కృష్ణ, నాయకుడు కాజూ మహ్మద్, వెంకటేశ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News