Thursday, January 23, 2025

బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

మోత్కూరు : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధ్ది సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిద పార్టీల నాయకులు బిఆర్‌ఎస్ లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. మోత్కూరు మండలంలోని పాటిమట్ల గ్రామానికి చెందిన కొత్తోజు నర్సింహ్మా చారి బుధవారం తిర్మలగిరిలో ఎమ్మెల్యే సమక్షంలోబిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధే లక్షంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. దేశంలో ఏరాష్ట్రంలో అమలు జరగని అనేక పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కెసీఆర్ కే దక్కుతుందన్నారు.

అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీలనుండి బిర్‌ఎస్‌లో కి నాయకులు చేరుతున్నారన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ చైర్మన్ , బిఆర్‌ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా నాయకులు గోరుపల్లి సంతోష్‌రెడ్డి, నార్మాక్స్ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహ్మరెడ్డి, నాయకులు బండ విజయ్ రెడ్డి, మోతె రాజిరెడ్డి, దొండ సత్తయ్య, మోతె నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News