Thursday, January 23, 2025

బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

అబ్దుల్లాపూర్‌మెట్: గడిచిన నాలుగేళ్లలో పసుమాములలో రూ.32 కోట్లతో అభివృద్ధ్ది పనులు నిర్వహించామని ఇబ్రహింపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నా యకులు పసుమాముల మజీ కౌన్సిలర్ పాడి జంగయ్య ఆధ్వర్యంలో 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కో సం అనేక సంక్షేమ పథకాలను సిఎం కెసిఆర్ ప్రవేశపట్టి అమలు చేస్తున్నా రు. రూ.4 కోట్లతో పసుమాముల పెద్ద అంబర్‌పేట్ డబుల్ రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధ్దం చేశామని తెలిపారు. అదే విధంగా గ్రామంలోని చెరువుల్లో కలుస్తున్న డ్రైనేజీ మురుగును నేరుగా మూసీలో కలిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొంత మంది కాంగ్రెస్ నాయకులు అభివృద్ధ్దిని చూ సి ఓర్వలేక పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

పాడి జంగయ్యకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో పర్వత్ శంకర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ కాటం మల్లేష్, బాబు, నవీన్, మల్లేష్‌తో పాటు 100 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ బిఆర్‌ఎస్ అధ్యక్షులు సిద్దంకి కృష్ణారెడ్డి, రాష్ట్ర యూత్ నాయకులు గోవర్ధనం ప్రవీణ్‌కుమార్, నాయకులు బలరాం, కౌన్సిలర్ హరిశంకర్, మాజీ కౌన్సిలర్ గౌని భా స్కర్‌గౌడ్, నాయకులు జోర్క రాము, మాడ్గుల వెంకటేష్‌గౌడ్, నాగర్జున తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News