నిర్మల్: ముఖ్యమంత్రి కెసిఆర్ జనరంజక పాలన చూసి బిఆర్‌ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయని మంత్రి అల్లోల ఇంద్ర కరణ్‌రెడ్డి అన్నారు. మాడ మండలంలోని పరిమెండల్ గ్రామానికి చెందిన బిజెపి, కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది నాయకులు, కార్యకర్తలు బుధవారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు.వారికి మంత్రి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శా్రస్త్రినగర్‌లో మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో అగ్రగామిగా నిలిపిన దార్శనిక డు సిఎం కెసిఆర్ అని పేర్కొన్నారు. కెసిఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి , దేశానికి శరణ్యమన్నారు. బిఆర్‌ఎస్ అభివృద్ధ్ది సంక్షేమమే ప్రధాన అజెండా అని పేర్కొన్నారు. ప్రతీ పల్లెకు అభివృద్ధ్ది ఫలాలు , ప్రతీ ఇంటికి చేరుతు న్నాయ న్నారు. సిఎం కెసిఆర్ అద్భుతమైన పాలన రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధ్ది సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్‌ఎస్‌లో చేరుతు న్నారన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం ఉంటుందన్నారు.
బిఆర్‌ఎస్‌లో చేరికలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -