Thursday, January 23, 2025

అభివృద్ధిని చూసే బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: అభివృద్ధిని చూసి బిజెపి, కాంగ్రెస్ నాయకులు బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. 2వ డివిజన్ గుండ్లసింగారం గ్రామానికి చెందిన బిజెపి, కాంగ్రెస్ పార్టీల నుంచి బిఆర్‌ఎస్‌లో చేరగా ఎమ్మెల్యే ఆరూరి గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ నాయకత్వంలో ప్రజా సంక్షేమ పాలనను అందిస్తున్న బిఆర్‌ఎస్‌లో చేరికలు కొనసాగుతున్నాయన్నారు.

ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా ఉండటమే కాకుండా వారిని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నారన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. పార్టీలో చేరిన వారిలో కిరణ్, చందు, మహేష్, సుమన్, తరుణ్, శశి, కృష్ణ, వేణు, కృష్ణ, ఎల్లమ్మ, కల, నిర్మల, రాజు, లక్ష్మి, చందు ఉన్నారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా ఆత్మ డైరెక్టర్ గణిపాక కల్పన విజయ్‌కుమార్, డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు జంగా కుమార్‌యాదవ్, మాజీ కార్పోరేటర్ కల్పన సింగులాల్, డివిజన్ ప్రధాన కార్యదర్శి వెంకట్‌గౌడ్, స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

* మన బడి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఈనెల 5న వర్ధన్నపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఆరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులను గురుపూజోత్సవం సందర్భంగా సన్మానించనున్నట్లు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తెలిపారు. దీనికి సంబంధించి అన్ని మండలాల ఎంఈఓలకు ఎమ్మెల్యే శాలువాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రభుత్వ విద్యాలయాల్లో జరుగబోయే గురుపూజోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో మన బడి మన బాధ్యత కోఆర్డినేటర్ దోమ కుమార్, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News