Thursday, January 23, 2025

అభివృద్ధికి మద్దతుగానే బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -
  • షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

కేశంపేట: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి మద్దతుగానే ఇతర పార్టీల నాయకులు బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని అల్వాల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజెపి నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఎమ్మెల్యే స్వగ్రామం ఎక్లాస్ ఖాన్‌పేటలో వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన అన్నారు. ప్రజల కష్టాలు తెలిసినవాడు మన ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టమని, మనకు ఏది అవసరమో ఆ పనులను అడగకుండానే చేసి పెడుతున్నాడని ఆయన అన్నారు.

ప్రతిపక్షాలకు అసత్య ఆరోపణలు చేయడం తప్ప అభివృద్ధికి సహకరించడం తెలియదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు తిరుమల్ రెడ్డి శ్రీలత శ్రీనివాస్, నవీన్ కుమార్, నాయకులు అంజిరెడ్డి, శేఖర్ పంతులు జమాల్ ఖాన్, తిరుమల్ రెడ్డి శ్రీనివాస్, వాడలా నర్సింహా, కటిక ప్రసాద్, కటిక రాఘవేందర్, కటిక రాము తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News