Thursday, January 23, 2025

అభివృద్ధిని చూసే గులాబీ దళంలోకి చేరికలు

- Advertisement -
- Advertisement -

దుగ్గొండి: బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బిజెపి నుంచి గులాబి దళంలోకి చేరుతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. దుగ్గొండి మాజీ వైస్ ఎంపీపీ, తిమ్మంపేట ఎంపీటీసీ కొక్కుల విజయ మొగిలి, కార్యకర్తలు శనివారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సిఎం కెసిఆర్‌తోనే అభివృద్ధి సాధ్యం అనేది నానుడిగా మారిందన్నారు.

అందుకే అభివృద్ధి కావాలంటే బిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని జనం బలంగా నమ్ముతున్నారన్నారు. ఈ నమ్మకంతోనే దుగ్గొండి మాజీ వైస్ ఎంపీపీ, తిమ్మంపేట ఎంపీటీసీ కొక్కుల విజయ మొగిలితోపాటు కార్యకర్తలు బిజెపికి రాజీనామా చేసి ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, సర్పంచులు, క్లస్టర్ బాధ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News