Saturday, February 22, 2025

ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీ: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు బిజెపి వైపే ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మొదటి ప్రాధాన్యతా ఓటుతోనే మూడు ఎంఎల్ సి సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని దుయ్యబట్టారు. పెద్దపల్లిలో బండి మీడియాతో మాట్లాడారు. కులగణన విషయంలో కొరివితో కాంగ్రెస్ తలగోక్కుంటుందని ఎద్దేవా చేశారు. బిసిల్లో ముస్లింలను ఎందుకు కలిపారని బండి ప్రశ్నించారు. ముస్లింలను తీసి బిసిలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముస్లింలను తొలగిస్తేనే బిసి రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందని స్పష్టం చేశారు.

ఎల్‌ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం కొత్త దుకాణం పెట్టిందని దుయ్యబట్టారు. ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి రేవంత్ ప్రభుత్వం ప్లాన్ చేసిందని ధ్వజమెత్తారు. టీచర్ల కోసం లాఠీ దెబ్బలు తగులుతున్నా తగ్గకుండా ఛాతీ ఎత్తి పోరాడామన్నారు. ఆంక్షలు, అడ్డంకులు సృష్టించినా అడుగేసి గురువుల కోసం గొంతెత్తామన్నారు. చావుకు ఎదురొడ్డి కొట్లాడి చదువులు చెప్పే ఉపాధ్యాయులకు అండగా నిలిచామని, అధికారం లేకుండానే టీచర్ల కోసం నిలబడ్డ తెగువ మాదని బండి సంజయ్ పేర్కొన్నారు.  ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధులకు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. శాసన మండలిలో బిజెపి అభ్యర్థులు మీ గొంతుకై నినదిస్తారని, మీ గోసలపై నిలదీస్తారని, సమస్యలని ప్రస్తావిస్తారని, పరిష్కార మార్గం పటిస్తారని అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News