Friday, February 21, 2025

నైతిక విలువలు పాటించండి … ఓటీటీలకు కేంద్రం వార్నింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇండియాస్ గాట్ టాలెంట్ (ఐజీఎల్) కార్యక్రమంలో రణ్‌వీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐటీ రూల్స్ లోని (2021) కోడ్ ఆఫ్ ఎథిక్స్‌ను ఓటీటీలు, సామాజిక మాధ్యమాలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం హెచ్చరించింది. చిన్నారులకు ఎ రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని ఆదేశించింది. సమాచార , ప్రసార మంత్రిత్వశాఖ గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా లోని అశ్లీల , అసభ్యకరమైన కంటెంట్‌లపై ఫిర్యాదులు అందాయి.

ఐటీ రూల్స్ లోని (2021) కోడ్ ఆఫ్ ఎథిక్స్‌ను సామాజిక మాధ్యమాలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా పాటించాలి. ఈ నిబంధనలు ఉల్లంఘించే ఏ కంటెంట్‌ను ప్రసారం చేయకూడదు. వయస్సు ఆధారిత కంటెంట్ అందుబాటులో ఉండాలి. స్వీయ నియంత్రణ కలిగిన ఓటీటీలు నైతిక విలువలను పాటించాలి ’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఐజీఎల్‌లో పాల్గొన్న ఓ వ్యక్తిని తల్లిదండ్రుల శృంగారం పైన ప్రశ్నించడంతో ప్రముఖ యూ ట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అతడి వ్యాఖ్యలపై పలువురు పార్లమెంట్ సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

సమయ్ లైనా షోలో రణ్‌వీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. దాంతో అతడిపై పలు రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వాటిపై ఇటీవల యూట్యూబర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు అన్నింటినీ క్లబ్ చేయాలని ఓ పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణలో భాగంగా సుప్రీం కోర్టు అల్హాబాదియా వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమం లోనే సామాజిక మాధ్యమాల్లో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించడానికి ఏవైనా చర్యలు తీసుకొనే యోచనలో ఉన్నారా ? అని సుప్రీం కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు సైతం జారీ చేసింది.
 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News