Monday, January 20, 2025

ఆదిపురుష్ సినిమా 2024లో విడుదల..

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన నెక్స్ట్ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అభిమానులకు అందించాలనుకుంటున్నాడు. దీని కోసం కేజీ ఎఫ్ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మూవీ ‘సలార్’ను ముందుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. 2023లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నాడు.బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో చేస్తున్న ఆదిపురుష్ సినిమాను 2024లో విడుదల చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడు. సంక్రాతికి రావాల్సిన ‘అధిపురుష్’ టీజర్ లో గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయని విమర్శలు వచ్చిన నేపథ్యం లో ఈ సినిమా విడుదల వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడట. ‘ఆదిపురుష్’ గ్రాఫిక్స్ ను నాణ్యంగా తీర్చిదిద్ది 2024లో ఈ మూవీని విడుదల చేయాలని భావిస్తున్నాడు. అదేవిధంగా దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న ‘ప్రాజెక్ట్ కె ‘ షూటింగ్ ను త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచన లో ప్రభాస్ ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News